2000 ఏళ్ల నాటి శవపేటిక.. అవశేషాలు ఎవరివో తెలుసా..

mysterious-black-sarcophagus-opened
దాదాపు 2000 ఏళ్ల నాటి శవపేటిక ఒకటి బయటపడింది. ఇది ఈజిప్టు దేశంలో వెలుగులోకి వచ్చింది. బయటపడిన మూడు అవశేషాలు అలెగ్జాండ్రియా ప్రాంతంలోని సిది గాబెర్ డిస్ట్రిక్ లో 332 బిఫోర్ క్రిష్ కాలం నాటివని ఆ దేశ పురావస్తు శాఖా మంత్రి వెల్లడించారు. ఇటీవల పురావస్తు శాఖా అధికారులు అలెగ్జాండ్రియా ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. దీంతో ఈ శవపేటిక బయటపడింది.దాన్ని ఓపెన్ చెయ్యగా మూడు అవశేషాలు బయటపడ్డాయి. అందులో మూడు అవశేషాలు ఉంటాయన్నదానికి బయటపడిన మూడు పుర్రెలు ఆధారం. శవపేటికలో మురుగునీరు చేరడంతో వాటిని తొలగించి అవశేషాలను బయటకు తీశారు. అందులో ఓ అవశేషానికి బాణం(విల్లు) ఉంది. దీంతో వారు సైన్యంలో పనిచేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.
శవపేటిక దాదాపు 9 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉంది. అలెగ్జాండ్రియాలో కనిపించే శవపేటికలలో ఇదే అతి పెద్దది అని.. దానిలో మోర్టార్ యొక్క మందపాటి పొరను కనుగొన్నట్టు ఈజిప్టు  సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్, ఈజిప్టు పురావస్తు శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అలెగ్జాండ్రియాలో ఖననం చేయబడిన తర్వాత శవపేటికను ఎప్పుడూ తెరువబడలేదని వెల్లడించారు.
 అయితే ఈ మూడు అవశేషాలల్లోకి మురుగునీరు ఎలా చేరింది, వారు ఎలా చనిపోయారన్నదానిపై పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు. వీరు యుద్ధంలో చనిపోయి ఉంటారన్న విషయం అర్ధమవుతున్నా..ఎన్నేళ్లు  కిందట చనిపోయి ఉంటారన్నది మాత్రం వెల్లడి కావడంలేదని వారు తెలిపారు. అయితే అవశేషాల తీవ్రత బట్టి చూస్తే సుమారు 2000 ఏళ్లకు చెంది ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.