సభలో కౌగిలింతలు, కన్నుగీతలు

ఓ పక్క అవిశ్వాస తీర్మానంపై వాడి వేడిగా చర్చ జరగుతుంటే.. మరో పక్క ప్రధాని మోదీ నవ్వులు పూయిస్తున్నారు. పార్లమెంట్ సభావేదికపై పెద్దల ప్రసంగం సీరియస్‌గా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ ఒప్పందంలో జరిగిన కుంభకోణం గురించి ఆరోపిస్తున్నారు. తాను స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిసి ఈ ఒప్పందం గురించి అడిగి తెలుసుకున్నానన్నారు. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు అలాంటి ఒప్పందం ఏదీ భారత్‌తో చేసుకోలేదని తనతో అన్నారని రాహుల్ ప్రసంగంలో వివరించారు. ఈ క్రమంలో రాహుల్ ప్రసంగం విన్న ప్రధాని మోదీ నవ్వులు చిందించారు. ప్రసంగం పూర్తయిన తరువాత రాహుల్ తన సీట్లోనుంచి లేచి ప్రధాని వద్దకు వెళ్లి ఆయన్ను కౌగలించుకున్నారు. ఈ హఠాత్‌పరిణామానికి మోదీ కూడా ఆశ్చర్యపోయారు. అనంతరం వెళ్లి పోతున్న రాహుల్‌ని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి, భుజంపై తట్టారు. తరువాత తన సీట్లోకి వెళ్లి కూర్చున్న రాహుల్‌ని తోటి సభ్యులు ఏదో అడగడంతో కన్నుకొడుతూ కనిపించారు. ఇప్పుడు ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -