సంసారంలో సరిగమలు.. ‘పనసపండు’తో పదనిసలు..

సీజనల్‌గా దొరికే పండ్లలో పనసపండు కూడా ఒకటి. చూడ్డానికి పెద్దగా ఉండి కొయ్యడానికి కూడా కష్టంగా ఉండే పండు పనసపండు. మార్కెట్లో పనసతొనల రూపంలో దొరుకుతాయి. మంచి వాసన వస్తూ నోరూరిస్తుంటాయి. తప్పనిసరిగా తినవలసిన పండు పనసపండు. ఉపయోగాలు చాలా ఉన్నాయి మరి. అవేంటో తెలుసుకుందాం.
* ఈ పండులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ మరియు ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి.
* ఇందులో ఉన్న ఫైటో న్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
* మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా శృంగారంలో పొందే ఆనందాన్ని అధికం చేస్తుంది అని అంటున్నారు.
* దీనిలో ఉన్న సోడియం అధిక రక్తపోటు బారి నుంచి కాపాడుతుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస కోస వ్యాధుల నుంచి కాపాడుతుంది.
* డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా పని చేస్తుంది. శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
* ఈ పండులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
* ఈ పండులో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది.
* చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మ కాంతిని పెంపొందిస్తుంది.
-ADVT-