ప్రాణాలతో చెలగాటం.. రియాల్టీ షోల్లో విన్యాసం.. పట్టుతప్పి..

viral-couples-daring-trapeze-act-goes-wrong
టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోలు ప్రేక్షకులతో పాటు జడ్జీలకు కూడా భయాన్ని కలిగిస్తాయి. ఒకరిని మించి ఒకరు తమ టాలెంట్‌ని ప్రదర్శించాలనుకుంటారు. ఈ క్రమంలో పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం. ప్రపంచంలో అత్యధిక ప్రేక్షకులు వీక్షించే రియాల్టీ షో ‘అమెరికా గాట్ టాలెంట్ షో’. దీంట్లో భాగంగా భార్యా భర్తలు టైస్ నిల్సన్, మేరీ వొల్ఫేలు కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 40 అడుగుల ఎత్తులో తాళ్లకు వేలాడుతూ ట్రాపెజ్ ట్రిక్స్ ప్రదర్శించారు.
వారి విన్యాసం ఎక్కడ పట్టు తప్పి పడిపోతారో అని అనిపించేలా ఉంది. దాంతో వీక్షకులంతా భయపడ్డారు. నిజంగానే భర్త నిల్సన్ పట్టుతప్పి భార్య వోల్ఫే కాళ్లు పట్టుకోవడంలో విఫలమయ్యాడు. అదృష్టం కొద్దీ ఆమెకు ఏమీ కాలేదు. పడిన వెంటనే వోల్ఫే లేచి నిలబడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షాక్‌కి గురైన జడ్జీలు మాత్రం ప్రాణం చాలా విలువైంది. షో కోసం రిస్క చేయవద్దు. ప్రాణాలతో చెలగాటమాడవద్దు అంటూ పార్టిసిపెంట్స్‌ని సున్నితంగా మందలించారు.