బ్రేకింగ్ : 82మంది మహిళా ఖైదీలకు ఆస్వస్థత..

women-inmates-fell-ill-mumbai-jail

82మంది మహిళా ఖైదీలు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని బైకుళ్లా కారాగారంలో మహిళా ఖైదీలకు శుక్రవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని  ముంబైలోని జేజే హాస్పిటల్ కు తరలించారు. అపరిశుభ్రమైన నీటి కారణంగానే వారు అస్వస్థతకు  గురై ఉంటారని డాక్టర్లు భావిస్తున్నారు. జైలు ఉన్నతాధికారి రాజ్‌వర్థన్‌ సిన్హా మాట్లాడుతూ.. మూడురోజుల క్రితం ఓ మగఖైదీకి కలరా రాగా వెంటనే మందులు ఇచ్చామని తెలిపారు. అయితే ఈ వ్యాధి ఇతరఖైదీలకు రాకుండా అందరికి మందులు అందజేశామన్నారు.కాగా మహిళా ఖైదీలు అస్వస్థతకు గురైన వెంటనే జైలులోని మిగితా అందరికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు.