ఈ సమయంలో నువ్వు ఉంటే ఎంత బాగుండేదో..!

అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన “ధడక్” సినిమా జూలై 20న విడుదలైంది. ఈ సినిమా విడుదల ముందురోజు బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో స్పెషల్ షోను ఏర్సాటు చేశారు. ఈ షోను చూసిన శ్రీదేవి దగ్గరి సన్నిహితురాలైన నటి షబానా అజ్మీ భావోద్వేగానికి గురయ్యారు. “శ్రీదేవి.. జాన్వీ తొలి సినిమాను నువ్వు చూసి ఉంటే బాగుండేది. నిజంగా చాలా గర్వపడేదానివి. ఒక అద్భుత నటి జన్మించింది”అంటూ షబనా అజ్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. శుక్రవారం విడుదలైన ‘ధడక్‌’ మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జాన్వీ నటనపై ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు.