కాలినడకన యాత్ర చేసి వైదిక ధర్మాన్ని పునః ప్రతిష్టించారు

aadhisankaracharyulu restarted vaidhika dharmam

సనాతన వైదిక ధర్మం కనుమాయిరుగైపోయే ప్రమాదం ఏర్పడిన సమయంలో ఆది శంకరులు కాశ్మీరునుండి కన్యాకుమారి వరకూ కాలినడకన యాత్ర చేసి వైదిక ధర్మాన్ని పునః ప్రతిష్టించారు. ఆ పరంపరలో కంచి కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన మహనీయులలో జయేంద్ర సరస్వతి కూడా ఒకరు. వీరి ఆధ్వర్యంలో కంచి కామకోటి అత్యున్నత ఆధ్యాత్మిక మార్గ నిర్ధేశం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి పాటుపడింది.