ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ చేప.. బరువెంతో తెలిస్తే..

అసలే వర్షాకాలం.. ఆపై భారీ వర్షాలకు నదులు, సముద్రాల్లో చేపలు విస్తారంగా పెరుగుతున్నాయి. వేటకు వెళ్లిన మత్సకారులకు వలలో చేపలు అందునా అరుదైన చేపలు చిక్కితే ఆనందం రెట్టింపవుతుంది. అయితే వేటకు వెళ్లకుండానే ఓ చేప ఒడ్డుకు చేరింది. ఒరిస్సా కొరాపుట్ జిల్లాలోని తెంతులిగుమ్మ గ్రామంలో ప్రవహిస్తున్న కొలాబ్ నదిలో పెద్ద చేప ఒకటి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ చేప బరువు సుమారుగా 70 కేజీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది జెల్లీ రకానికి చెందినది అని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. నదిలో ఇంత పెద్ద చేప దొరకడం ఇదే మొదటి సారి అని స్థానికులు అంటున్నారు. మాంసాహార ప్రియులకు పెద్ద చేపలంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ చేప ముక్కలను కొనడానికి స్థానికులు క్యూ కట్టారు.