శ్రీకాకుళంలో నాటు పడవ బోల్తా.. 8మంది మత్స్యకారులు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకూ బలపడుతుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విజయనగరం జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన బోట్‌ సిక్కోలు తీరం ఉమిలాడ వద్దకు చేరింది. దీనిలో 8మంది మత్స్యకారులున్నారు. బోటు తిరగబడటంతో ఒకరు గల్లంతవ్వగా.. మిగిలిన ఏడుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
పడ బోల్తా పడిన వెంటనే, ముగ్గురు మత్స్యకారులు అతికష్టం మీద బయటపడ్డారు. మిగతా ఐదుగురులో.. నలుగురు ఉదయం ఒడ్డుకు చేరుకున్నారు. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.