పైకి ఆధ్యాత్మిక కేంద్రం.. లోపల బాబాగారి రాసలీలలు.. 120మంది మహిళలపై..

మనసుకి ప్రశాంతతను చేకూర్చేది మనసైన బాబాలు మాత్రమే.. ప్రశాంత నిలయాలు ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు.. గొంతులో అమృతం కురిపించే వ్యాఖ్యలు… నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నట్టు బిల్డప్‌లు.. మీ బాధలన్నీ నావే.. మీకెందుకు నేనున్నాంటూ భరోసాలు.. పైకి ఆశ్రమం.. లోపల రాసలీలల వ్యవహారం. భక్తితో పాటూ ఇక్కడ ముక్తి కూడా ఫ్రీగా దొరుకుతుంది. ఇలాంటి డేరాబాబాలను ఎంతమందిని అరెస్టు చేసినా మరో డేరా ఎక్కడో ఒకచోట ఓపెన్ చేస్తూనే ఉంటారు దొంగబాబాలు. ఇలాంటి వాళ్లు ఉండబట్టే బాబా అనే పేరు వింటేనే భయంపట్టుకుంది జనాల్లో.
హర్యానాలోని ఫతేబాద్ సమీపంలోని తోమానా పట్టణంలో బాబా అమరపురి అలియాస్ బిల్లు ఆధ్యాత్మిక కేంద్రం పేరుతో డేరా తెరిచాడు. బాబా అసలు పేరు అమర్ వీర్.. వయసు 60 ఏళ్లు. బాబాగారి ప్రవచనాలు వినడానికి ఆడవాళ్లు ఎక్కువగా ఆకర్షితులయ్యేవారు. బాబా మహిళలకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకునేవాడు. మాటలతో లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా ఏకంగా 120 మంది మహిళలను లొంగదీసుకున్నాడు. పైగా ఈ వ్యవహారాన్నంతా మొబైల్‌లో రికార్డు చేసి వారిని బెదిరించేవాడు. మళ్లీ మళ్లీ కోరిక తీర్చమంటూ బెదిరించేవాడు. బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన మహిళలు బాబాకి లొంగిపోయేవారు. అయితే బాబా చీకటి వ్యవహారం ఎంతో కాలం సాగలేదు.
బంధువు ఒకరు పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో బాబా డేరాని కదిలించారు పోలీసులు. రాసలీలల వీడియోల ఆధారంగా బాబాపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధిత మహిళలను విచారించగా వారు నిజ నిజాలను బయట పెట్టడానికి ముందుకు రాలేదు. ఇద్దరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు వివరించారు పోలీసులకి. బాబా మాత్రం పోలీసులకు తగిన ముడుపులు చెల్లించనందుకే తనను అనుమానించి, అరెస్టు చేశారంటూ వాపోతున్నాడు.