ఆమె ప్రమేయం అసలు లేదా.. క్యాస్టింగ్ కౌచ్‌పై మమత హాట్ కామెంట్స్..

మళయాళీ బ్యూటీ మమతా మోహన్ దాస్ రాజమౌళి యమదొంగ సినిమాలో మెరిసింది. కింగ్ సినిమాలో నాగార్జునతో ఆడిపాడింది. తెలుగు తెరకి దూరమైనా తమిళ, మళయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న మమత ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే.. ఇప్పుడు కొత్తగా దీనిపై మాట్లాడడమేమిటి. అయినా ఈ విషయంలో కేవలం పురుషుల్ని మాత్రమే తప్పు పట్టలేం. మహిళలకు కూడా బాధ్యత ఉంటుంది.
అమ్మాయి పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఎంతో కొంత ఆమె ప్రమేయం కూడా ఉంటే ఉంటుంది. అమ్మాయి అందంగా ఉంటే మరీ కష్టం. అందరి చూపులు ఆమె వైపే ఉంటాయి. క్యాస్టింగ్ కౌచ్‌కి గురయ్యేది ఎక్కువగా అలాంటి వారే. అందంగా లేని వారు సంతోషంగానే గడిపేస్తారు. పురుషుడు ఏదైనా కామెంట్ చేస్తే అతిగా స్పందించడం, హద్దులు దాటి ప్రవర్తించడంలాంటి విషయాల్లో మహిళల ప్రమేయం కొంత ఉంటుందనేది నా అభిప్రాయం అని అంటూ, అందరూ ఇలానే ఉంటారనేది నా అభిప్రాయం కాదు అని అందరికంటే భిన్నంగా స్పందించింది మమతా మోహన్ దాస్.