ప్రధాన మంత్రి వ్యక్తిగత వివరాలు తస్కరణ..

method-of-attack-showed-high-level-of-sophistication

సింగపూర్‌లో 15 లక్షల మంది రోగులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు తస్కరించారు. ఇందులో ప్రధాన మంత్రి లీ సెయిన్‌ లూంగ్‌ వివరాలూ ఉండటం గమనార్హం. దేశంలోని అతిపెద్ద ఆరోగ్య పరిరక్షణ సంస్థ ‘సింగ్‌హెల్త్‌’ కంప్యూటర్లలోకి చొరబడ్డ నేరగాళ్లు ఈ తస్కరణకు పాల్పడ్డారు. చోరీకి గురైన సమాచారంలో రోగుల ఆరోగ్య రికార్డులు, రోగ నిర్ధారణ పరీక్షలు, సూచించిన ఔషధాలు వంటివి ఉన్నాయి. ఈ ఘటనపై ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ప్రజలకు క్షమాపణలు కోరారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -