అంత్యక్రియలకు వచ్చి కొడుకును పోగొట్టుకున్నారు..

missing-boy-dead-body-found-nizamabad

అదృశ్యమైన బాలుడిని మృత్యువు కబళించింది. బంధువు చనిపోవడంతో నాందేడ్‌ కు చెందిన రియాజ్‌ కుటుంబం నిజామాబాద్ వచ్చింది. అంత్యక్రియల్లో పాల్గొన్నకుటుంబసభ్యులు నాందేడ్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రియాజ్ కుమారుడు జమీల్‌(7) కనిపించకుండా పోయాడు. ఇంటినుండి అదృశ్యమైన జమీల్ కోసం వెతుకుచుండగా నిజామాబాద్ బైపాస్‌ రోడ్డు వద్ద నాలాలో మృతదేహాం లభ్యమైంది. ప్రమాదవశాత్తు నాలాలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ బాలుడు అదృశ్యమైన జమీల్ గా పోలీసులు గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించగా ఆ బాలుడు తమ కుమారుడు జమీల్ అని గుర్తించారు. అంత్యక్రియలకోసం వచ్చి కొడుకుని పోగొట్టుకున్నామని జమీల్ తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.