వావ్.. రాహుల్ సార్ నేనూ సేమ్ టూ సేమా.. ప్రియా వారియర్

అవిశ్వాస తీర్మానంపై వాడి వేడిగా చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన ప్రసంగ పాఠం పూర్తయిన తరువాత ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకోవడం, ఆపై సీట్లో కూర్చుని తోటి నేతలపై కన్నుగీటడం.. మొత్తానికి రాహుల్ వ్యవహారం కొంచెం తేడాగా అనిపించింది సభలోని పెద్దలకు.
ఇంటర్నెట్లో సంచలనమైన ప్రియా వారియర్ సైతం రాహుల్ కన్నుగీటుకి నేను కూడా ఫిదా అయ్యానంటూ పోస్ట్ పెట్టింది. కాలేజీనుంచి వచ్చిన తనకు అమ్మ ఈ విషయం చెప్పింది. టీవీ ఆన్ చేస్తే ఇదే న్యూస్‌ని హైలెట్ చేస్తూ వార్తలు. సోషల్ మీడియాలో రాహుల్ సార్‌ని నన్ను పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందంటూ ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రియ తన స్పందనను తెలియజేసింది. మరోసారి తనపేరు ఈ విధంగా సోషల్ మీడియాలో మారుమ్రోగడం ఆనందాన్నిస్తోంది అని హర్షం వ్యక్తం చేస్తోంది.