శ్రీశైలంలో గో సంరక్షణ పథకం

srisailam-goshala

గోవు సకల దేవతాస్వరూపమని వేదాలు,వేదాలకు ప్రతిరూపమని పురాణాలు చెబుతున్నాయి. గోవు దేవతా స్వరూపమే గాక, ధర్మానికి ప్రతిరూపమని హైందవ భావన. అందుకే మన సంస్కృతిలో గోవును పూజించడం కేవలం భగవంతుని సేవగానే కాకుండా , ఒక పవిత్ర సంప్రదాయంగా కూడా కొనసాగుతోంది. భక్తుల్లో మన ఆర్ష సంప్రదాయాలను కొనసాగింపజేసి తద్వారా వారిలో భక్తి ఆధ్యాత్మిక భావాలను, ధర్మ చింతను పెంపొందించాలనే ఆశయంతో శ్రీశైలం దేవస్థానం గోశాలను నిర్వహిస్తూ, గోవులను పోషిస్తోంది. ప్రస్తుతం అక్కడ 800 లకు పైగా గోవులు దేవస్థానంనుంచే పోషింపబడుతున్నాయి. గోవుల పరిరక్షణ కోసం దేవస్థానం అధునాతన ఏర్పాట్లతో గోశాలను నిర్వహిస్తోంది. ఈ గో పోషణలో భక్తులకు కూడా అవకాశాన్ని కల్పించాలననే భావనతో శ్రీశైలంలో దేవస్థానం గో సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది.