సప్తమోక్షపురాలలో జగన్నాధపురి

Unknown facts about Jagannath Ratha Yatra

సప్తమోక్షపురాలలో జగన్నాథపురి ఒకటి. ఒడిషా రాష్ట్రంలో సముద్ర తీరాన ఈ మహనీయ క్షేత్రం కొలువై ఉంది. 11 వ శతాబ్దంలో కళింగ దేశాన్ని పాలించిన అనంత వర్షన్ చోడగంగదేవుడు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. అనంగ భీమదేవుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయ సంపద అంతా అనంగ భీమదేవుని కాలంలో సమకూరినదే. ఏటా అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రలో పాల్గొని రథాన్ని ముందుకు లాగే మోకును పట్టుకుని అడుగులు వేసినా చాలు జన్మ ధన్యం అవుతుందని భక్తులు భావిస్తారు.