మానవుడు మరింత చిత్రమైనవాడు

unknown facts about man born

భగవంతుడి సృష్టి చాలా విచిత్రమైనది. ఆ సృష్టిలో మానవుడు మరింత చిత్రమైనవాడు.”నరత్వం దుర్లభం లోకే” అన్న శృతి వాక్యాన్ని బట్టి మానవుడు జన్మించడమే చాలా గొప్ప విషయం అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. నరులలోనూ ఉత్తములైనవారికి, భాగ్యవంతులకు మాత్రమే విద్యా బుద్ధులు బాగా అబ్బుతాయి. వారిలోకూడా వివేకము కలిగినవారు అరుదు. అలాంటి వివేకాన్ని కలిగించే సూక్తులను సుభాషితాలు అంటారు. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ,పద్య,గద్య కావ్య,రూపక,స్తోత్రాదులు సూక్తి భరితాలు. సు + ఉక్తి = మంచిమాట. సు + భాషితము = సుభాషితము అని శబ్ద నిర్వచనం. ఇది చింతను తొలగిస్తుంది. నిరాశను దూరం చేస్తుంది. ఉత్సాహాన్నిపెంచుతుంది. పునరుజ్జీవింపజేస్తుంది కనుక దీన్ని సుధ అనికూడా పిలుస్తారు.