అసభ్యంగా తాకాడని మహిళ చేసిన పని చూస్తే..

waitress-punished-man-who-groped-her-georgia

పబ్లిక్ ప్లేస్ అన్న ఇంగితం కూడా లేకుండా కొంతమంది మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను అసభ్యంగా తాకుతూ.. పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలా ప్రవర్తించిన ఓ వ్యక్తిని చేరేసిందోమహిళా.. జార్జియాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జార్జియాలోని సవన్నా రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి వచ్చాడు. వెయిట్రెస్ ఈమెలియా(25)   తన పనిలో బిజీగా ఉన్నారు.. ఇంతలో ఆ వ్యక్తి ఈమెలియా వెనకాల నుంచి వెళుతూ ఆమెను అసభ్యంగా తాకాడు. అంతే ఎక్కడలేని కోపాన్నితెచ్చుకుని క్షణం ఆలస్యం చేయకుండా అతన్ని పట్టుకుని ఉతికి ఆరేసింది. ఆ తరువాత పోలీసులకు చెప్పడంతో  వారు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో  నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. అయితే ఆమె మాత్రం అతన్ని అలాగే పట్టుకున్నారు. పైగా సదరు వ్యక్తి భార్య పిల్లలు వదలమని బ్రతిమిలాడినా కూడా ఈమెలియా వినకుండా అతన్ని పోలీసులకు అప్పగించింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.