ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన జగన్!

బీజేపీ తీరుకు నిరసనగా మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. బంద్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. లోక్‌సభ సాక్షిగా కేంద్రం మరోసారి ఏపీని మోసం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.. 25 మంది ఎంపీలు నిరాహారదీక్షకు కూర్చుంటే కేంద్రం దిగివస్తుందన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ ఎంత బలంగా ఉందో మిగిలిన పార్టీలకూ తెలియాలన్నారు జగన్‌.