ఆటగాడి నిర్వాకం..భార్య పక్కన ఉండగానే..

ఇంగ్లండ్‌ చెందిన పుట్‌బాల్ ప్లేయర్‌ తనతో బలవంతంగా శృంగారంలో పాల్గోని ఆపై డబ్బు ఇచ్చి తను నోరు తెరవకుండా ఉండేందుకు యత్నించాడని ఓ మహిళ ఆరోపణలకు దిగింది. క్యూబెక్‌కు చెందిన మిలా బొన్నెట్‌(34) అనే మహిళ ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యారు.ఆ పార్టీకి ఇంగ్లండ్‌ స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్ కూడా హాజరయ్యాడు. ఆ పార్టీలో మిలాకు.. ఆ ఆటగాడి మధ్య కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాటలు కలిశాయి.తర్వాత వారిద్దరూ కలిసి అల్కహల్ సేవించారు.దీంతో వారు మాటలు కలిసినట్టు మత్తులో శరీరాలు కూడా ఏకమయ్యాయి. రాత్రి మొత్తం వారిద్దరూ రూంలో ఏకాతంగానే గడిపారు. మిలాకు మత్తు వదిలిన తర్వాత పుట్‌బాల్ ప్లేయర్‌‌ను చూసి ఆశ్చర్యానికి గురైయ్యారు. అసలు విషయంపై అతన్ని నిలదీయగా పరువు పోతుందనే ఉద్దేశంతో మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో ఆమె మీడియా ముందు వచ్చారు. “భార్య పక్క రూమ్‌లో ఉండగానే నాతో ఏకాంతంగా గడిపాడు. నిజం బయటకు రాకుండా ఉండానికి ఓ స్నేహితుడ్ని పంపి రెండు వేల పౌండ్లు చెల్లిస్తానని రాయబారం నడిపాడు. అలాంటి వాడికి శిక్ష పడాలి. అతనేంటో ఈ ప్రపంచానికి తెలియాలని” వ్యాఖ్యానించారు.