కూలీగా మారిన పరిటాల సునీత

ఏపీ మంత్రి పరిటాల సునిత కూలీగా మారారు. పేరూర్ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి. అక్కడ పనిచేస్తున్న కూలీలతో కలిసి కాసేపు మట్టి ఎత్తారు. అచ్చం కూలీలానే తలకు ఎండ తగలకుండా గుడ్డ కట్టుకుని మంత్రి పనిచేశారు. ప్రాజెక్ట్ పనులు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి.. తమతో కలిసి పనిచేయడంతో కూలీలు సంతోషానికి లోనయ్యారు.

హంద్రీనీవా జలాలను తరిలించేందుకు చేపట్టిన పేరూర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈనెలాఖరున సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం అక్కడ భారీ పైలాన్ నిర్మిస్తున్నారు. ఈ పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి సునీత ఇలా కూలీలతో కలికి కాసేపు మట్టి తట్టలు ఎత్తారు.