టీటీడీ ఉద్యోగి మృతి కేసులో కొత్త ట్విస్ట్‌

టీటీడీ ఉద్యోగి మృతి కేసులో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. గుండెపోటుతో మృతి చెందాడని ముందుగా భావించినా..అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆత్మహత్యకు ముందు భార్య, ఆమె బంధువులు వేధింపులతోనే తాను  చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనకు అక్రమ సంబంధం అంటగట్టి…తనను, తన తల్లిని నడిరోడ్డులో కొట్టారని వాపోయాడతను. ఆ మనస్తాపంతోనే తాను చనిపోతున్నానని..తనపై దాడి చేసిన బంధువులను శిక్షించాలని కోరాడతను.

మృతుడు అనిల్‌ కుమార్‌ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లికి ముందు ప్రేమించిన యువతితో  అక్రమసంబంధం కొనసాగిస్తున్నాడని అతనిపై భార్య తరపు బంధువులకు అనుమానం. ఇదే విషయంపై అనిల్‌ కుమార్‌ను నిలదీసి రోడ్డుపైనే దాడి చేశారు. మనస్తాపంతో అనిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయితే..విషయం బయటపడకుండా గుండెపోటుగా చిత్రీకరించిన కుటుంబసభ్యులు..గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రయలు కూడా నిర్వహించారు. అయితే..సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియోలు బయటపడటంతో మృతి అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి.