నగరాన్ని కమ్ముకున్నదట్టమైన పొగ..జనం ఉక్కిరిబిక్కిరి

న్యూయార్క్ నగరంలోని రద్దీగా ఉంటే ప్రాంతంలో స్టీమ్ పైప్ పేలడంతో ఒక్కసారిగా ఆప్రాంతంలో దట్టమైన పొగకమ్ముకుంది. దీంతో ఏంజరిగిందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. మాన్ హట్టన్ లోని మిడ్ టౌన్ రద్దీప్రాంతంలో ఈ పైప్ లైన్ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా పొగతో కప్పెయ్యడంతో ఏం జరుగుతుందో తెలియక జనం అక్కడినుంచి పరుగులుతీశారు. వెంటనే అక్కడికిచేరుకున్న ఎమర్జెన్సీ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. పైప్ లైన్ బ్లాస్ట్ కారణంగా చుట్టుపక్కల ఉన్న 50కి పైగా భవనాల్లోని ప్రజలను ఖాళీచేయించారు. అయితే రసాయనాలు వెలువడుతున్నాయోమోనని ప్రజలు ఆందోళనకు గురై అక్కడినుంచి దూరంగా వెళ్లారు.