మంత్రాల పేరుతో 60 మంది మహిళలపై అత్యాచారం

హరియాణా రాష్ట్రానికి చేందిన ఓ మాంత్రికుడు కష్టాలు తీరుస్తానంటూ మహిళల్ని నమ్మబలికి వారిని లోబరుచుకొని లైంగిక వాంఛ తీర్చుకోనేవాడు. అమరపురి అనే వ్వక్తి లైంగిక సంతృప్తి కోసం తాంత్రికుడి అవతారం ఎత్తాడు. మీ కష్టాలను తీరుస్తానంటూ మహిళలకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. కష్టాల తీరుస్తాడని నమ్మి అతని దగ్గరకు వచ్చిన మహిళలకు శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి, స్పృహ కోల్పోగానే అత్యాచారం జరిపేవాడు. అ దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించి, బాధిత మహిళల్ని బెదిరించి డబ్బు గుంజేవాడు. అనుకోకుండా మాంత్రికుడు ఫోన్‌లోని అశ్లీల దృశ్యాలను చూసిన అతడి బంధువు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాదాపు అతను 60 మహిళలఫై అత్యాచారం జరిపినట్టు పోలిసులు ప్రాథమిక విచారణలో తేలింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -