పడవ ప్రమాదం.. 17మంది మృతి

అమెరికాలోని మెస్సోరిలో జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మది మందితో సహా 17మంది మరణించారు.
టేబుల్ రాక్ సరస్సులో మొత్తం 31మంది సందర్శకులతో బయలు దేరిన డక్ బోట్, తీవ్రమైన తుఫాన్ దాటికి అలలు ఎగిసి పడటంతో సరస్సులో మునిగిపోయింది. అయితే సహాయక సిబ్బంది 14మందిని రక్షించగలిగారు. మిగిలినవారు నదిలో గల్లంతయ్యారు.
బోట్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కోల్మన్ అనే మహిళ,తన ముగ్గురుపిల్లలు, భర్తతోపాటు తొమ్మిది మంది బంధువులను కోల్పోయానని కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది.
బోట్ అధికారులు లైవ్ జాకెట్లు అవసరం లేదన్నారని, అవి వేసుకొని ఉండిఉంటే తమ పిల్లల ప్రాణాలు దక్కేవని అంటోంది. అయితే గల్లంతైనవారికోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరంచేశారు.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -