హవ్వ.. బాలయ్య హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి..

after-two-years-thanushree-dutta-back-mumbai

2003 మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న నటి ఆమె.. ఆ క్వాలిఫికేషన్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. సినిమాలు ఇక చాలు అనుకుందో ఏమో సడన్ గా వెండితెరకు దూరమై అమెరికాకు వెళ్లిపోయింది. రెండేళ్ల తరువాత ఇండియాకు వచ్చిన ఆ సుప్రసిద్ధ నటిని ఎయిర్ పోర్టులో కనీసం పలకరించే వ్యక్తి కరువయ్యారు. ఇంతకీ ఆమె ఎవరా అని సందేహ పడుతున్నారా..? ఆమె.. తనుశ్రీదత్తా.. 2005లో ‘ఆషిఖ్‌ బనయా ఆప్నే’తో బాలీవుడ్‌లో ఈ బ్యూటీ ఆ తరువాత ‘చాకోలేట్‌’, ‘రఖీబ్‌’, ‘ధోల్‌’, ‘రిస్క్‌’, ‘గుడ్‌ బాయ్‌, బ్యాడ్‌ బాయ్‌’ వంటి హింది చిత్రాలోనే కాక తెలుగులో నందమూరి నటసింహం బాలయ్య సరసన ‘వీరభద్ర’ సినిమాలో నటించింది. 2010 లో ‘అపార్ట్‌మెంట్‌’ తనుశ్రీకి చివరి సినిమా. 2016 లో ఈ నటి అమెరికా వెళ్లిపోయారు. అమెరికా నుంచి మళ్ళీ తిరిగి ముంబైకి వచ్చింది. అయితే ముంబై ఎయిర్ పోర్టులో ఆమెను కనీసం పలకరించలేదు దీనికి కారణం ఆమె ఒక్కసారిగా మారిపోవడమే.. అంతమందు స్లిమ్ గా ఉండే తనుశ్రీ.. అమెరికా వెళ్లి లావెక్కరు. దాంతో ఆమెను ఎవరు గుర్తుపట్టలేదు. కాగా ఎయిర్ పోర్టులో తీయించుకున్న కొన్ని ఫోటోలను తనుశ్రీ దత్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ‘రెండేళ్ల తర్వాత ముంబై వస్తున్నాను’ అని క్యాప్షన్ ఇచ్చారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -