బిగ్‌బాస్ షోలో మరో లీక్.. తేజస్వీ ప్లేస్‌లో ఈ భామే!

>‘బిగ్‌బాస్’ సీజన్ 2 బుల్లితెర ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో.. ముఖ్యంగా ఎలిమినేట్ విషయంలో ఉత్కంఠ రేపుతూ సాగుతోందీ.

హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతారో అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షో కోసం ఆసక్తిగా ఎదురు

ఇంతకు ముందు యాంకర్ శ్యామల విషయంలో ఇలానే జరిగింది. నిన్నటి ఎపిసోడ్‌లో (ఆదివారం) తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయిన విషయం ముందే లీకైంది

ప్రతివారం జరగబోయే షో ఒకరోజు ముందుగానే షూట్ చేస్తారు. అదే రీతిలో ఆదివారం ప్ర‌సారం అయిన ఎపిసోడ్ ముందుగానే షూట్ చేశారు.. అందులో పాల్గొన్న‌ ఆడియ‌న్స్..  తేజ‌స్వీ ఎలిమినేట్ అయిన విషయం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తేజస్వీయే ఎలిమినేట్‌ అవుతుందని అందరూ ఊహించారు.. ఓ టాస్క్‌లో కౌశల్‌తో ఆమె ప్రవర్తించిన తీరు.. ప్రేక్షకుల్లో వ్యతిరేకతను తీసుకురావడమే గాక కౌశల్‌ను హీరో చేసింది.

దీంతో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌‌గా కొనసాగిన భాను శ్రీ గతవారం ఎలిమినేట్‌ అయింది. కౌశల్‌ వ్యవహారంలో చేసిన తప్పుకు ప్రేక్షకులు భానుతో పాటు తేజస్విని శిక్షించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు తేజస్విని  స్థానంలో హెబ్బా పటేల్ ఇంటిలోకి వెళ్తుందనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ భామ ఇంట్లోకి అడుగు పెడితే  షోకి మరింత గ్లామర్‌ వస్తుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు.