ఆన్‌లైన్‌లో పాము ఆర్డర్.. యువతి మృతి..

chinese-woman-dies-online-delivered-poisonous-snake

ఆన్‌లైన్‌లో పామును ఆర్డర్ ఇచ్చిన ఓ యువతి.. ఆ పాము ద్వారానే ప్రాణాలు కోల్పోయింది. చైనా షాంగ్జీ ఏరియాకు చెందిన 21 ఏళ్ల యువతికి స్నేక్‌ వైన్‌ తాగాలనిపించింది. అయినా స్నేక్ వైన్ ఏంటి..? దాన్ని తాగడం ఏంటని ఆశ్చర్యపోకండి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చైనాలో కొన్ని ప్రాంతాల్లో పలురకాలుగా స్నేక్‌ వైన్‌ను తయారుచేసుకుని ఇష్టంగా తాగుతారు. అలాగే ఆ యువతి కూడా స్నేక్ వైన్ తాగడంకోసం ఆన్‌లైన్‌లో కింగ్ కోబ్రాను ఆర్డర్ చేసింది. దాన్ని వైన్ సీసాలో బంధించింది. ఈ క్రమంలో అది తప్పించుకుని సీసాలోనుంచి బయటకు వచ్చింది. దాన్ని తిరిగి పట్టుకుని బంధించే క్రమంలో సదరు యువతి ఆ పాముకాలుకు గురైంది.అపస్మారక స్థితోలో పడివున్న ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందిందని ఆమె తల్లి వెల్లడించారు. కాగా దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ప్రస్తుతం పామును విక్రయించిన ఈ కామర్స్ వెబ్సైటును గుర్తించే పనిలో పడ్డారు.