కడపలో ఉద్రిక్తత.. యువకుడిపై సీఐ దాడి

కడపలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్‌ సర్కిల్‌లో ఓ యువకుడిపై సీఐ దాడిచేయడం కలకలం రేపింది.. రాత్రి బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో వలరాజు అనే యువకుడు రోడ్డు దాటుతున్న సమయంలో ఇంటెలిజెన్స్‌ సీఐ సదాశివయ్య వాహనం ఎదురు వచ్చింది.
వాహనానికి అడ్డు వచ్చాడన్న కారణంతో సీఐ సదాశివయ్య యువకుడిపై దాడి చేశాడు. కాళ్లతో తన్ని మరీ కోపం తీర్చుకున్నాడు.సీఐ తీరుకు నిరసనగా యువకుడి బంధువులు, స్నేహితులు స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. సీఐని ఘోరావ్‌ చేశారు.
వీరి ఆందోళనతో మరింత రెచ్చిపోయిన సదాశివయ్య.. మరికొంతమంది పోలీసులతో ఆ యువకుణ్ని చిన్న చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
స్థానికుల ఆందోళనను చిత్రీకరిస్తున్న మీడియాపైనా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.. దాడి దృశ్యాలు ఎందుకు రికార్డ్‌ చేస్తున్నారంటూ తిట్ల పురాణం ఎత్తుకున్నారు.
పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సామాన్యులకు రక్షణగా నిలబడాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు.