వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యువతి

female-student-rescues-elderly-man-china

చైనాలో 81 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు కాపాడింది ఓ యువతి. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. చైనాలోని జింజూ రైల్వే స్టేషన్‌లో 81 ఏళ్ల వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమీపంలోనుంచే వెళుతున్న ఓ యువతి వృద్ధుడి పరిస్థితి చూసి ఒకవైపు పడుకోబెట్టి, అతని మోకాళ్ల మీద కూర్చుని రెండుచేతులనూ కలిపి బలంగా అతని ఛాతీ ఎముక మీద నెమ్మదిగా నొక్కింది. ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించింది. ఇలా అరగంట పాటూ కొనసాగించడంతో వృద్ధుడు శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. దీంతో యువతి చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. కాగా ఆమె జింజూలోని మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌ డింగ్‌ హుయ్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.