హైదరాబాద్‌లో అర్థరాత్రి అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో అర్థరాత్రి అగ్నిప్రమాదం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది.. జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో రెండు ఫ్యాక్టరీలు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

మొదట అట్టల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.. ఆ వెంటనే పక్కనే ఉన్న ఫ్యాన్ల కంపెనీకి వ్యాపించాయి.. మంటలను గమనించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు. వారొచ్చేలోగానే మొత్తం కాలిబూడిదైపోయింది.. మంటలను అదుపు చేయడానికి ఫైర్‌ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది.

అర్థరాత్రి అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల జనం వణికిపోయారు. ప్రమాదం జరిగిన ఫ్యాన్ల కంపెనీ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసులు ఆందోళనకు గురయ్యారు.

జనావాసాల మధ్య ఫ్యాక్టరీలతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు భయం భయంగా బతుకీడ్చాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు. ఫ్యాక్టరీలను మరో ప్రాంతానికి తరలించాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదంటున్నారు.