అభిమానులకు శుభవార్త చెప్పిన చై.. సామ్..

‘ఏం మాయ చేశావె’ మూవీతో లవ్‌ జర్నీ స్టార్ట్ చేశారు చైతు-సామ్.. పెళ్లి తర్వాత ఇన్నాళ్లకు మరో ప్రేమాయణానికి సిద్ధమయ్యారు.. వివాహం చేసుకున్న తరువాత ఇప్పటి వరకు వీరు కలిసి నటించలేదు.

వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఫాన్స్‌కు శుభవార్త చెప్పారు చై ఫ్యామిలీ.

చైతు, సామ్ హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ‘నిన్ను కోరి’తో హిట్ కొట్టిన శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం ఉదయం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై స్క్రిప్టును తన చేతుల మీదుగా దర్శకుడు శివ నిర్వాణకి అందజేశారు. పెళ్లి తర్వాత చై-సామ్‌ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -