బిగ్‌బాస్ హౌస్‌లో నానీ క్లాస్.. తేజస్వీ గురించి..

‘కామెంట్స్ హద్దుమీరుతున్నాయి. విమర్శలు, ప్రశంసలు ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ అవి మరీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. మీలానే అవతలి వారు కూడ సామాన్య వ్యక్తులే. కాకపోతే వారి టాలెంట్‌తో సెలబ్రిటీలు అయ్యారు.

అంత మాత్రం చేతే వారిపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం, నోటికి వచ్చినట్లు మాట్లాడడం, స్వేచ్చ ఉంది కదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వంటివి చేస్తే ఆ వ్యక్తికి ఎంత బాధ ఉంటుంది.

ఓ సారి ఆలోచించండి’ అంటూ బిగ్‌బాస్ హోస్ట్ నానీ ఒకింత ఘాటుగానే నెటిజన్స్‌పై విరుచుకుపడ్డాడు. ఎలిమినేట్ అయిన తేజస్విని ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ తనకు చాలా బాధకలిగించాయని నానీ అన్నారు.