ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించండి : హైకోర్టు

swami-paripoornandha-swamiji-petision-against-social-boycott

స్వామిపరిపూర్ణానంద హైదరాబాద్ బహిష్కరణపై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై విధించిన హైదరాబాద్ నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు పరిపూర్ణానంద. ప్రతివాదిగా పోలీస్ కమిషనర్‌ను చేర్చారు. దీనిపై కోర్టులో పరిపూర్ణనంద తరపున  మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించిగా.. ప్రభుత్వం నుంచి అడిషినల్ ఏజీ రామచందర్ రావు వాదించారు. ఆదిలాబాద్, కరీంనగర్ లో గతంలో స్వామి ఇచ్చిన స్పీచ్ లపై  బహిష్కరించామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా.. హైదరాబాద్ పరిధిలో ఎలాంటి కేసులు లేకుండా ఎలా బహిష్కరణ చేస్తారన్న పిటీషనర్ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఎప్పుడో ఇచ్చిన స్పీచ్ లపై  ఇప్పుడు ఎలా బహిష్కరిస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాగ్రహ యాత్ర కు మొదటి అనుమతి ఇచ్చి తర్వాత ఎందుకు నిరాకరించారో తెలపాలని  పిటిషనర్ కోరారు. ఆర్టికల్19 ప్రకారం భారత దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుందని కోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది. స్వామి పరిపూర్ణ నంద పై వేసిన నగర బహిష్కరణ ఎత్తివేయాలని కోరారు. ఇరువాదనలు విన్న హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం స్వామిజీ  పై జారీ చేసిన వర్జినల్  డాక్యుమెంట్లను రేపు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.