టోల్ గేట్ దగ్గర టీడీపీ నేతల వీరంగం..

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ దగ్గర టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. పోలవరం సందర్శనకు వెళ్తున్న టీడీపీ శ్రేణుల బస్సును టోల్‌ప్లాజా దగ్గర ఆపి వివరాలు అడిగారు. టోల్ రుసుము చెల్లించాలన్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు సహనం కోల్పోయారు.

పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న తమకే టోల్‌ ఛార్జీలు అడుగుతారా అంటూ… అక్కడి సిబ్బందిపై దాడి చేశారు. టోల్ అద్దాలు పగలగొట్టారని… సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.