ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యవహారం సుఖాంతం

tdp-mp-jc-diwakar-reddy-episode-end
టీడీపీలో అగ్గిరాజేసిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యవహారం సుఖాంతమైంది.. చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిన జేసీ తన నిర్ణయానికి గల కారణాలను ఆయనకు వివరించినట్లు సమాచారం.. దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్యా చర్చలు జరిగాయి. సమస్యలు పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎంతో భేటీ తర్వాత రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు ఎంపీ. సీఎం హామీతో సచివాలయం వెళ్లిన జేసీ.. అధికారులను కలిసి పెండింగ్ ఫైళ్లపై చర్చించారు.
ఈ దేశంలో ఎవరి మీదా అలిగి ప్రయోజనం ఉండదని జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. పార్లమెంటుకు వెళ్లకపోవడానికి వేరే కారణాలున్నాయన్నారు. రాజకీయ వాతావరణం బాగోలేదన్న జేసీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోడీ ఉన్నంత కాలం పోరాటం చేయాల్సిందేనన్నారు. రాజకీయాల్లో అతివృష్టి అనావృష్టి ఉండకూడదన్నారు. చివర్లో పార్లమెంటుకు వెళ్తానంటూ హింట్‌ ఇచ్చారు జేసీ.