తొలిఏకాదశి నాడు గోమాతను పూజిస్తే..

ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో వచ్చే మొదటి ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశి. మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు కావునా ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు గోమాతను పూజిస్తే పవిత్ర పుణ్యనదుల్లో స్నానమాచరించినంత భాగ్యం కలుగుతుంది. గోశాలకు వెళ్లి శుభ్రం చేసి రంగవల్లులతో అలంకరించాలి. మహాలక్ష్మీ సమేతుడైన శ్రీమహావిష్ణువును పూజించిన వారికి సకల అభీష్టములు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. గోపద్మ వ్రతాన్ని ఆచరించిన ఫలితం సిద్ధిస్తుంది.