ఒకే ఇంట్లో 11మంది ఆత్మహత్య కేసులో గుండె బద్దలయ్యే ఘటన..

tommy-last-survivor-burari-horror-house-dies-heart-failure

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకేఇంట్లో 11 మంది ఆత్మహత్య కేసులో మరో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి, పెట్‌ డాగ్‌ ‘టామీ’ హార్ట్‌ అటాక్‌తో మరణించింది. కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఈ డాగ్ కు తీవ్రంగా చలి జ్వరం వచ్చింది. దాంతో సంజయ్‌ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఈ డాగ్ హార్ట్‌ అటాక్‌తో మృతిచెందింది.ఇంతకాలం ప్రేమ, ఆప్యాయతల మధ్య జీవించిన ఈ పెట్‌ డాగ్‌, సడన్ గా వారు దూరమయ్యేసరికి కొత్త వాతావరణానికి అలవాటుపడలేకపోయింది. ఈ క్రమంలో దీని ఆరోగ్యం మరింత క్షీణించి మృత్యువాత పడివుంటుందని జంతు సంరక్షణ అధికారి ఒకరు చెప్పారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -