బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది..

సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతున్న బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. మరాఠీలో మొదలైన బిగ్‌బాస్ సీజన్ 1 నిన్నటితో ముగిసింది. విజేతగా మేఘాధాడే నిలిచారు. రెండవ స్థానాన్ని పుష్కర్ జోగ్ దక్కించుకున్నారు. మొదటి విజేతకు రూ.50లక్షల పారితోషికం వచ్చింది. ఈషోలో 15 మంది పార్టిసిపెంట్లు పాల్గొనగా, ఫైనల్‌కు చేరింది ఆరుగురు. హోస్ట్‌గా వ్యవహరించిన మంజ్రేకర్ ఆకట్టుకున్నారు. అన్ని భాషల్లో బిగ్‌బాస్ సక్సెస్ అయ్యింది. దీనికి కారణం హోస్ట్ ఎంకరేజ్‌మెంట్‌తో పాటు పార్టిసిపెంట్స్‌ కూడా. ఒక్కసారి హౌస్‌లోకి వెళ్లగానే తమదైన ప్రపంచంలోకి వెళ్లిపోతున్నారు. వారి సొంత ఇళ్లని కూడా మర్చిపోతున్నారు. మొత్తానికి బుల్లి తెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.