ఉద్యోగం పోయినా లేక మానేసినా పీఎఫ్..

చేస్తున్న ఉద్యోగం మానేసినా లేదా కోల్పోయినా నెల రోజుల్లో పీఎఫ్ అకౌంట్‌లోని నగదును 75 శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ సోమవారం లోక్‌సభలో తెలిపారు. జూన్ 26న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనను పరిశీలించామని గంగ్వార్ తెలిపారు. దీని ప్రకారం ఈపీఎఫ్ మెంబర్ నెల రోజుల పాటు ఎలాంటి ఉద్యోగం సంపాదించుకోని పక్షంలో.. తన మొత్తం సొమ్ములో 75 శాతం విత్ డ్రా చేసుకునే వీలుంది. అదే రెండు నెలలు ఉద్యోగం లేకపోతే మిగతా మొత్తాన్నికూడా తీసేసుకోవచ్చు. మహిళా ఉద్యోగులకు మరింత వెసులు బాటు కల్పించింది ప్రభుత్వం. వీరు పెళ్లి కోసం ఉద్యోగం మానేసినట్లైతే పీఎఫ్ మొత్తాన్ని వెంటనే విత్ డ్రా చేసుకోవచ్చని గంగ్వార్ తెలిపారు.

-ADVT-