ఏపీకి 22 వేల కోట్లు ఇస్తాం : కేంద్రమంత్రి పియూస్‌ గోయల్‌

central-minister-piyush-goyel-talks-in-parliament

ఏపీకి ప్రత్యేక హోదా వల్ల 17 వేల కోట్ల రూపాయలే వస్తాయని కేంద్రమంత్రి పియూస్‌ గోయల్‌ అభిప్రాయ పడ్డారు. అందకే హోదా కంటే ఎక్కువగా సాయం చేసేందుకు.. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో 22 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.. ఇక 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టు ఆర్థిక లోటు భర్తీ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు ఆయన. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రెవెన్యూ లోటు కింద ఇచ్చిన నిధులను రైతు రుణమాఫీకి.. విద్యుత్‌ సంస్థల బకాయిలకు, పెన్షన్లు మంజూరు చేయడానికి వాడుకోందని ఆయన ఆరోపించారు.