భార్య బెడ్రూమ్‌లో.. భర్త మరొకరితో.. స్టార్ ప్లేయర్ రాసలీలలు..

England-footballer-sex-woman-holiday-wifes-paid-hush-money
పక్కన భార్య ఉన్నా చూపులు పక్కన ఉన్న అమ్మాయిపై పడ్డాయి. ఆమెతో మాట కలిపాడు. తన కోర్కె తీర్చమంటూ ప్రపోజ్ చేశాడు. ఇంగ్లండ్ పుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ స్టార్ ప్లేయర్ ఓ స్టార్ హోటల్‌‌లో జరిగిన పార్టీకి తన భార్యతో సహా హాజరయ్యాడు.  క్యూబెక్‌కు చెందిన మిలా బొన్నెట్ అనే మార్కెటింగ్ మేనేజర్ కూడా ఆ హోటల్‌లో దిగింది. ప్లేయర్‌కు మిలాను పరిచయం చేశాడు మరో ఫ్రెండ్. అలా మిలాతో మాటలు కలిపిన ప్లేయర్ తన మాటల్లో ఆమె పట్ల ఇష్టాన్ని కనబరిచాడు. అదే విషయం ఆమెకు చెప్పి ప్రపోజ్ చేశాడు. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్నారు.
అదే హోటల్‌లో బెడ్రూమ్‌‌లో నిద్ర పోతున్నభార్య, భర్త ఇంకా రాని విషయాన్ని గమనించుకుని అతడికి ఫోన్ చేసింది. పక్కనే ఉన్న మిలాకు అతడు సింగిల్ కాదు. పెళ్లైందనే విషయాన్ని గుర్తించింది. అదే విషయాన్ని అతడిని అడిగేసరికి పరువు పోతుందని అక్కడినుంచి తప్పించుకున్నాడు. మధ్యవర్తి ద్వారా రెండు వేల పౌండ్లు చెల్లిస్తానని వదిలేయమంటూ రాయబారం నడిపాడు. కానీ ప్లేయర్‌ని వదిలేది లేదంటూ మీడియా ముందుకు వచ్చి వివరించింది మిలా. అతడ్ని అరెస్టు చేయమంటూ డిమాండ్ చేస్తోంది. ప్లేయర్ వ్యవహారం అతడి భార్యకు, ప్రపంచానికి తెలియాలని అంటోంది.