దావానంలా వ్యాపిస్తున్న మంటలు.. తగలబడుతున్న అడవి..

Greece-fire-Athens-wildfires-forest-fire-news-video-death-toll

గ్రీస్ లోని ఏథెన్స్ అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు దావానంలా వ్యాపిస్తున్నాయి.  భయంకరమైన మంటల ధాటికి ఇప్పటివరకు 60 మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. వందలాది ఇళ్లు, వాహనాలు కాలిబూడిదయ్యాయి.  చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని కోస్టుగార్డు, మిలటరీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు గ్రీస్ మినిస్టర్ నిక్టారియస్ తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఆరువందల అగ్నిమాపక వాహనాలతోపాటు, హెలికాప్టర్లు, విమానాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నికీలల కారణంగా అక్కడి ఉష్టోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 40 డిగ్రీలకంటే అధికంగా నమోదయ్యాయి.