బైక్ వెనుక కూర్చున్న భార్య బ్రిడ్జ్‌పైకి రాగానే..

భర్తతో పాటు బైక్ మీద వస్తోంది ఓ మహిళ. బ్రిడ్జి మీదకు రాగానే భర్తని బండి ఆపమని కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి నదిలోకి దూకేసింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన మహ్మద్ రఫీ,  భార్య గుల్ అప్షాన్ ఖతూన్ దంపతులు బాలగంజ్‌లో నివసిస్తున్నారు. వీరికి సంవత్సరం క్రితం వివాహమైంది. నెల రోజుల పాప కూడా ఉంది. ఈ మధ్య భార్య ఖతూన్‌ అనారోగ్యం పాలవడంతో భర్త రఫీ ఆమెకు వైద్యం చేయిస్తున్నాడు.
ఈ క్రమంలోనే సోమవారం భార్యని తీసుకుని గోమతినగర్‌లోని ఆసుపత్రికి భార్యని తీసుకుని వెళ్లాడు. డాక్టర్‌కి చూపించుకుని తిరిగి వస్తూ ఖతూన్ తనకు కళ్లు తిరుగుతున్నాని భర్తని బైక్ ఆపమంది. భర్త బైక్ ఆపగానే వెళ్లి గోమతి నదిలోకి దూకేసింది. ఓ క్షణం నిశ్చేష్టుడైన భర్త రఫీ వెంటనే తను కూడా నదిలోకి దూకేశాడు. గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. ఈత వచ్చిన కొందరు నదిలోకి దూకి భార్యాభర్తలను రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు.
ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న భార్యకు చికిత్స ఇప్పిస్తున్నానని భర్త రఫీ పోలీసులకు తెలియజేసాడు. తనప్రవర్తన ఈ మధ్య కొంచెం విరుద్ధంగా ఉండడం గమనించబట్టి ఆమె నదిలోకి దూకిన వెంటనే తాను కూడా దూకి భార్యని కాపాడుకున్నానని చెప్పాడు రఫీ. అదృష్టం కొద్దీ అందరి సహకారంతో మేము బ్రతికామని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.