ఎన్నికల్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులు

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలోని 272 స్థానాల కోసం దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.  85 వేల పోలింగ్ బూత్‌లలో, 10 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 4 లక్షల మంది పోలీసులు, 3 లక్షల 71 వేల మంది సైనికులు పోలింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు.

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అక్కడి పార్లమెంట్‌లోని 272 సీట్లకు…, 4 రాష్ట్రాలు పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్‌ రాష్ట్రాల్లోని 577 అసెంబ్లీ స్థానాలకు పాకిస్తానీలు ఓటేస్తున్నారు. పోలింగ్ ముగిసిన 24 గంటల్లోనే ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.

పాకిస్తాన్ ఎన్నికల్లో నవాజ్‌షరీఫ్‌కు చెందిన PML-NQ, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన PTI మధ్యే ప్రధాన పోటీ ఉంది. అయితే.. అవినీతి ఆరోపణలతో నవాజ్‌ షరీఫ్, ఆయన కూతురు మరియం జైలుకెళ్లడం ఆయన పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఆయనపై వ్యతిరేకత ఇమ్రాన్‌ఖాన్‌వైపు టర్న్ అవుతోంది. పైగా పాక్ ఆర్మీ సైతం ఇమ్రాన్ ఖాన్ పార్టీవైపే ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -