ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కలకలం

7th class students suicide in musheerabad

ముషీరాబాద్ లో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం వేధించడంతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. కవాడీగూడా లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న మహేష్.. ఇవాళ పద్మశాలి కాలనీలోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అసలు మహేష్ రెండు రోజుల నుంచి స్కూల్ కే రావడం లేదని యాజమాన్యం ఆధారాలు చూపిస్తోంది. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.