దేశం విడిచి వెళ్లినా… సాంప్రదాయాలు మరువలేదు

singapoor-bonalu

సింగపూర్ లో అమ్మవారి బోనాల సంబురాలు వైభవంగా జరిగాయి. దేశం విడిచి వెళ్లినా…మన సాంప్రదాయాలను పాటిస్తున్న ఎన్ఆర్ఐలు..లష్కర్ బోనాలను తలపించారు. పోతురాజుల నృత్యాల మధ్య ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించారు. హైదరాబాద్ బోనాలను తలపించిన గల్ఫ్ బోనాలు..తెలుగు సాంప్రదాయాలు, భక్తిని చాటాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ ఒగ్గు కళాకారుడు శ్రీ బొల్లి రాజు యాదవ్ గారి ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.

సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారిలో 600 మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కవిత, సునీత, అనిత ఆధ్వర్యంలో భక్తులు బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. ఈ వేడుక కోసం సిటీ నలు మూలల నుండి బస్సు సౌకర్యం కల్పించారు సింగపూర్ అధికారులు . మునుపెన్నడూ లేనివిధంగా ఈ బోనాలు పండగ బాగా జరిగిందన్నారు భక్తులు. ఇన్ఫర్మేషన్ ఇవగానే బోనాల పండుగకు తరలొచ్చిన భక్తులకు పెద్ది శేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వాళ్ళ కోసం రాబోయే రోజుల్లో మరిన్ని ఉత్సవాలను జరుపుతామని అన్నారు.