నన్ను ఇబ్బంది పెట్టారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు: యాంకర్ ఝాన్సీ

బుల్లితెరపై యాంకర్‌గా అడుపెట్టిన ఝాన్సీ కొన్ని సీరియల్స్‌లో కూడా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. చిన్న తెరపైనే కాదు బిగ్ స్క్రీన్‌పై కూడా నటించి మెప్పిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను ఓ డైరక్టర్, ఓ హీరో మోసం చేసాడని చెప్పింది. వచ్చిన అవకాశాల్ని వినియోగించుకున్నానే తప్ప ఎవరి దగ్గరా ఆఫర్ల కోసం చేయి చాచలేదంది. తన మనసుకి కష్టం కలిగే పని ఏదీ చేయలేదని చెప్పింది. ఇష్టం లేకపోతే వాళ్లతో మాట్లాడేదాన్ని కాదు. నన్ను ఇబ్బంది పెట్టిన ఒక పెద్ద డైరక్టర్, ఓ పెద్ద హీరో తనతో రెండు రోజులు సినిమాకు సంబంధించిన వర్క్ చేయించుకున్నారని చెప్పింది. దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చేశారు. కానీ ఆ తరువాత తనని కాకుండా వేరే వాళ్లతో తన పాత్ర చేయించారట. దానితో అవమానంగా భావించిన ఝాన్సీ వారితో ఇంతవరకు మాట్లాడలేదట. అయితే వారు కూడా తమ కెరీర్‌లో చాలా దెబ్బ తిన్నారని, నన్ను ఇబ్బంది పెట్టడం వల్లే వాళ్లకి అలా జరిగిందని ఝాన్సీ చెప్పింది.