నేనున్నా లేకున్నా జాన్వీకి తోడుగా..

అందాల తార శ్రీదేవి పిల్లలు జాన్వీ, ఖుషీలు అమ్మ చాటు బిడ్డలుగా పెరిగారు. ఇప్పుడు అనురాగం పంచి, అన్ని జాగ్రత్తలు చెప్పే అమ్మ దూరమైనా నాన్నగా బిడ్డల పట్ల తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని అన్నారు బోనీ కపూర్. జాన్వీ నటించిన థడక్ సినిమా సక్సెస్ అవడంతో, తండ్రి నిర్మాణ సారథ్యంలో జాన్వీ రెండో సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో కుమర్తె ఖుషీ కూడా సినిమాల్లోకి రావాలనుకుంటుందట.

ఇదిలా ఉండగా జాన్వీ కెరీర్ విషయంలో కరణ్ జోహార్ ఎప్పుడూ సూచనలు సలహాలు ఇస్తూ అండగా నిలుస్తారని బోనీ అన్నారు. ఈ విషయాలన్నీ బోనీ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. నా పిల్లల అభిప్రాయాలకు నేనెప్పుడూ విలువ ఇస్తాను. జాన్వీ సినిమాల్లోకి రావాలనుకోవడం తన ఇష్టమే. ఖుషీ కూడా మోడలింగ్ రంగంలోకి అడుగుపెడతానంటోంది. అర్జున్ కపూర్‌లో హీరో లక్షణాలు ఉన్నాయని ముందుగా గుర్తించింది సల్మాన్ ఖాన్ అన్నాడు.

తనుకూడా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుని సక్సెస్ అయ్యాడు. పెద్ద కుమార్తె అన్షులా చదువులో ఎప్పుడూ ముందుంటుంది. నేను నా కుమార్తెలకు తండ్రిలా కాకుండా ఓ స్నేహితుడిలా ఉంటానన్నారు. ఖుషీ, జాన్వీ చాలా చిన్నపిల్లలు. వారికి నేనెప్పుడూ ఓ మంచి ఫ్రెండ్‌లా ముందుండి మంచీ చెడు వివరిస్తుంటాను. నాతో పాటు కరణ్ కూడా. నా వయసు 63 ఏళ్లు. ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియదు. అన్నిటికీ సిద్ధపడే ఉన్నానన్నారు బోనీ కపూర్.