నవ్వాడని ప్రాణం తీశాడు

కొన్ని సార్లు  పరాచకాలు  ప్రాణాల  మీదకు తెస్తాయి. హాస్యం శృతిమించితే అనర్ధానికి దారి తీస్తుంది.నవ్విన నేరానికి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.  చెన్నైలోని   పళని ఆండవర్‌ ఆలయం వీధిలో దురై అనే వ్యక్తి వీఎస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ నడుపుతున్నాడు.  దురైకి  మరో ఊరిలో పని ఉండగా  తన తమ్ముడైన  రాజేశ్(25)కు  ఫాస్ట్‌పుడ్ సెంటర్  బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు.  రెండురోజుల తర్వాత దురై తిరిగి చెన్నైకి చేరుకున్నాడు.  వ్యాపారం సరిగా చూసుకోలేదని  రాజేశ్‌ను  మందలిస్తుండగా ఫాస్ట్‌ఫుడ్‌లో పనిచేస్తున్న జయప్రకాష్‌  నవ్వాడు. అతడు  నవ్వడాన్ని అవమానంగా భావించిన  రాజేశ్  అతనిపై పగ పెంచుకొన్నాడు.  సోమవారం రాత్రి జయప్రకాష్‌  నిద్రపోతున్న సమయంలో  మెడకు తన ప్యాంటుకున్న బెల్టును బిగించి అతని ప్రాణాలు తీశాడు రాజేశ్. రాత్రంతా అదే గదిలో నిద్రించిన అతను   తెల్లవారుజామున  పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు.